సోమవారం (డిసెంబర్) క్రిస్మస్ సెలవు కాబట్టి కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొదటి వారంలోనే రూ. 400 కోట్ల మార్క్ క్రాస్ చేసింది కాబట్టి, రెండో వీక్ ముగిసే సరికి రూ.1000 కోట్లను దాటవచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషించాడు
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషించాడు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా మెరిసింది. బాబీ సింహా, జగపతిబాబు, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబాలే ఫిల్మ్స్’ పతాకంపై విజయ్ కిర్గందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ‘సలార్’ సినిమా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాల రిలీజులు లేవు కాబట్టి ప్రభాస్ సినిమా మరిన్ని రికార్డులు అధిగమిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. బాహబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన’రాధే శ్యామ్’, ‘సాహో’, ‘ఆదిపురుష్’ సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే ఎట్టకేలకు ‘సలార్’తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు.