భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఇది సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరుగుతుంది. ఇక్కడ పిచ్ వేగంగా, బౌన్సీగా ఉంటుంది. ఇది దక్షిణాఫ్రికాలో అత్యంత వేగవంతమైన పిచ్‌గా గుర్తింపు పొందింది. దీంతో బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
