బీఆర్ఎస్‌ పేరు ఢిల్లీ లెవెల్‌లో గట్టిగా వినిపించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే సమాధానం ఇవ్వాలి. ఇదీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ టార్గెట్. అందుకే, సారు.. కారు.. పదహారు స్లోగన్‌ మళ్లీ తెరపైకి తేబోతున్నారు. మరి.. టార్గెట్-16 కోసం కేసీఆర్‌ రచిస్తున్న వ్యూహాలేంటి? ఈసారి అభ్యర్ధులను మారుస్తారా? మారిస్తే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్ధులను సెలెక్ట్‌ చేయబోతున్నారు?

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన ప్రత్యర్ధిగా ఎక్స్‌పోజ్ చేశారు కేసీఆర్. కాని, పార్లమెంట్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదు. బీజేపీ కూడా ఫోర్స్‌గా అటాక్‌ చేస్తుంది. ఈసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఫేస్‌ చేయాలి. పైగా పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి పార్లమెంట్‌ ఎన్నికలు. ఢిల్లీలో బీఆర్ఎస్ పేరు గట్టిగా వినిపించాలంటే.. తెలంగాణ గల్లీల్లో గట్టిగా కొట్లాడాల్సిందే. అందుకే, వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీపై దాడి మొదలుపెట్టారు. రెండు వారాలైనా కాకముందే.. అటాకింగ్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. పథకాల అమలు ఇంకెప్పుడని ఇరుకునపెట్టే వ్యూహంతో వెళ్తున్నారు. ఇటు పథకాలను అమలుచేస్తూ పాలన కొనసాగించడమా, లేక పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టడమా అనే సందిగ్ధంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లేలా అసెంబ్లీ వేదికగా పావులు కదుపుతున్నారు. ఆల్రడీ ఆ ప్రక్రియ జరుగుతోంది కూడా.

ప్రధాని పీఠంపై ఎవరు కూర్చోవాలనే అంశమే ప్రధానంగా పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతాయి. అయితే, తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా గట్టిపోటీనిస్తుంది. దీంతో తెలంగాణలో త్రిముఖ పోటీ ఉండనుంది. అయితే, కాంగ్రెస్-బీజేపీకి చెక్‌పెడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే ఎందుకు ఓటు వేయాలో గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే గులాబీ బాస్ ప్రత్యేక ప్లాన్‌తో రాబోతున్నట్టు చెబుతున్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రియాశీలకంగా ఉంటుందని ఏనాడో చెప్పారు కేసీఆర్. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందెడ్, నాగ్‌పూర్, సోలాపూర్‌ ప్రాంతాల్లో కమిటీలు వేశారు. మరి ఆయా రాష్ట్రాల్లో పోటీ చేస్తారా, సమీకరణాలను మారుస్తారా అనేది బీఆర్ఎస్ అధినేతే రివీల్ చేయాల్సి ఉంటుంది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *